కెయస్ రవికుమార్ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రూలర్’. ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్.. వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్.. ట్రైలర్లు ఇప్పటికే విడుదలయ్యాయి. నిన్నమరో ట్రైలర్ ను విడుదల చేసింది ‘రూలర్’ టీమ్.
ఈ సినిమా బాలయ్య స్టైల్ మాస్ ఎంటర్టైనర్ అనే సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే ఈ ట్రైలర్ లో కూడా మాస్ ఎలిమెంట్స్ అన్నీ రంగరించారు. ట్రైలర్లో బాలయ్య స్టైల్ పంచులకు కొదవేమీ లేదు. “ఏరా యూపీ వాళ్లకి తెలుగువాడు యముడిలా కనిపిస్తున్నాడా?” అంటూ గర్జిస్తారు పోలీసు బాలయ్య. ఇక మరో సీన్ లో “గ్లోబ్ ని గోళీలా చేసి పడుకున్న చోటునుంచే ప్రపంచాన్ని చుట్టేలా చేసిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు నీకు తాగుబోతుల్లాగా అనిపించారా?” అంటూ ఐరన్ మ్యాన్ గెటప్ బాలయ్య ఓ వెరైటీ లాజిక్ చెప్తూ విలన్ ను గద్దిస్తారు బాలయ్య. ఇక ఈ ట్రైలర్లో యాక్షన్ సీన్లు.. సోనాల్ చౌహాన్ బికినీ షో.. బాలయ్య మార్క్ స్టెప్పులు అన్నీ దట్టించారు. ఇక ఫైనల్ గా వచ్చే “ఎలెక్షన్ ఎలెక్షన్ కు పవర్ కట్టైపోద్దిరా పోరంబోకు” అనే డైలాగ్ మాస్ కు వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది.
ఇదంతా బాలయ్య వన్ మ్యాన్ షో. ఫుల్ మాస్.. ఊర మాస్.. బాలయ్య మాస్. అభిమానులను ఫుల్లుగా అలరించడానికి బాలయ్య రెడీ అయినట్టుంది. మరి సాధారణ ప్రేక్షకులు ఈ మాస్ మసాలాకు ఎంతమాత్రం ఇంప్రెస్ అవుతారో వేచి చూడాలి. సినిమా రిలీజ్ అయ్యేలోపు ఈ కొత్త ట్రైలర్ కూడా చూసేయండి.