ఇంకా సింగిల్ గానే ఉన్నా -కియరా

కియరా అద్వాణీ.. సౌత్ – నార్త్ అనే తేడా లేకుండా అన్నిచోట్లా మార్మోగిపోతున్న పేరు ఇది. కెరీర్ ప్రారంభించిన కేవలం ఐదేళ్లలోనే అసాధారణ స్టార్ డమ్ ని అందుకున్న ఈ లక్కీగాళ్ ఇప్పటికిప్పుడు అరడజను క్రేజీ చిత్రాలతో బిజీగా ఉంది. వీటిలో కిలాడీ స్టార్ అక్షయ్ తో రెండు సినిమాలు చేస్తోంది. 2019-20 సీజన్ కియరాకి అంకితం అంటే తప్పేమీ కాదు.

అన్నట్టు ఇలాంటి లక్కీ గాళ్ ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదా?  ఏ కుర్రాడికి మనసివ్వలేదా? అంటే .. అందుకు తనే స్వయంగా ఆన్సర్ చేసింది. అపుడెపుడో స్కూల్ డేస్ లో డేటింగ్ చేశాను. ప్రస్తుతానికి సింగిల్ గానే ఉన్నా.. ఎవరితోనూ డేటింగులో లేను! అని క్లారిటీగా చెప్పేసింది. కియరా చెప్పిన దానిని బట్టి తనని ఆరాధించే బోయ్స్ కి ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టే.

2019 కియరాకి బాగా కాలిసొచ్చిన ఏడాది. హిందీలో కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో కియరా పేరు ఉత్తరాది అంతటా మరోమారు మార్మోగింది. తన రియల్ లైఫ్ క్యారెక్టర్ కి దూరంగా ఉండే ప్రీతి పాత్రలో జీవించడంపై క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. అసలు రియల్ లైఫ్ లో ప్రీతి లాంటి అమ్మాయి ఉంటుందనే దానిని తాను నమ్మను అని చెప్పిన కియరా ఆ పాత్రలోకి పరకాయం చేసిన తీరుకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఇక ఇదే హుషారులో 2020 కి వెల్ కం చెబుతోంది ఈ బ్యూటీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *