జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఢిల్లీలో పాగా వేశాయి. బుధవారం కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ను కలిసిన ఆ పార్టీల నాయకులు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీలో వారి తదుపరి కార్యచరణను ప్రకటించారు. అమరావతి రాజధాని వ్యవహారాన్ని కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన జేపి నడ్డాను కలవనున్నట్లు తెలిపారు.
అమరావతికి మద్దతుగా ఫ్రిబ్రవరి 2న లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజధాని ప్రాంత రైతులకు అండగా ఉంటూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.