ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలయ్యతో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కె రోజా అసెంబ్లీలో సెల్పీ దిగారు. రోజా, బాలయ్య దిగిన ఫోటోను షేర్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తన అధికారిక ట్విట్టర్ లో కమెంట్ చేశారు. సెల్ఫీలో రోజాగారు హీరోలా కనిపిస్తున్నారు. కానీ ఆమె కుడి పక్కన ఉన్న వ్యక్తి ఎవరో గానీ అసహ్యంగా ఉన్నారు.
ఈ ఫ్రేమ్‌లో అతను రోజా గారి అందాన్ని పాడు చేస్తున్నారు. ఒకవేళ అతను ఆమెకు దిష్టి బొమ్మ కావచ్చు అంటూ వర్మ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది. దీంతో పాటు అందమైన రోజా గారి పక్కన కూర్చుని.. ఆ ఫోటోను నాశనం చేసిన ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా… అని కోరుతూ వర్మ మరో ట్వీట్ చేశారు.