నోబెల్ ప్రైజ్ విన్నర్స్ సాధారణంగా ఎవరి మీదా కామెంట్స్ కానీ, స్టేట్ మెంట్స్ ఇవ్వడం కానీ చేయరు. అసలు నోబెల్ విజేతలు సాధారణంగా ఎవరిని కలవరు.. వారిని కలవడానికి కూడా సాధారణ మనుషులకు అవకాశం ఉండదు. కానీ తాజాగా ప్ర ముఖ నోబెల్ బహుమతి గ్రహీత, జర్మనీ శాస్త్రవేత్త జాన్ బి గుడెనఫ్ ఏపీ సీఎం జగన్ ను వేయినోళ్ల పొగిడారు. ఏపీలో సంక్షేమ రాజ్యాన్ని అమలు చేస్తున్న సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు.
*ఎవరీ నోబెల్ విజేత జాన్ బి గుడెనఫ్?
జాన్ బి గుడెనఫ్ జర్మనీకి చెందిన ఇంజనీరింగ్ శాస్త్రవేత్త. 1922 జూలై 25న జన్మించారు. ప్రస్తుతం మన జీవిన విధానంలో భాగమైపోయిన స్మార్ట్ ఫోన్ లో వాడే ‘లిథియమ్-ఇయాన్’ బ్యాటరీ క్యాథోడ్ ను కనుగొన్నదే ఈయనే. ఈ ఆవిష్కరణకు గాను గుడెనఫ్ కు 2019వ సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి వచ్చింది. ఈయన కనిపెట్టిన బ్యాటరీయే మనం వాడుతున్న సెల్ ఫోన్ నడవడానికి కారణమైంది.. ప్రస్తుతం గుడెనఫ్ ప్రపంచ ప్రఖ్యాతి టెక్సాస్ యూనివర్సిటీ, అస్టిన్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
* గుడెనఫ్ ను కలిసిన డాక్టర్ కుమార్ అన్నవరపు
ప్రఖ్యాత నోబెల్ శాస్త్రవేత్త గుడెనఫ్ ను తాజాగా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు, ఆయన భార్య రాజేశ్వరిలు ప్రత్యేకంగా కలిశారు. అమెరికా, భారతీయ విద్యా విధానంపై చర్చించారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ప్రజల జీవన ప్రమాణాలను మార్చడానికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇవన్నీ విన్న గుడెనఫ్ ఆశ్చర్యపోయారు. ప్రపంచంలోనే ఇంతటి అద్భుత సంక్షేమ రాజ్యం ఏపీలో ఉండడంపై ప్రశంసలు కురిపించారు. రైతు భరోసా, అమ్మఒడి తదితర పథకాలు, వాటి లక్ష్యాల గురించి వినగానే జగన్ పై ఒక వీడియోలో మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు.
*జగన్ పాలనపై గుడెనఫ్ ప్రశంసలు
ఈ మేరకు గుడెనఫ్ విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ గరిష్టంగా లబ్ధి ప్రయోజనం అందినప్పుడే సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమని గుడెనఫ్ ప్రశంసించారు. ఆ దిశగా కృషి చేస్తున్న ఏపీ సీఎంను కొనియాడు. సీఎం జగన్ పథకాల వల్ల ఏపీప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. తాను త్వరలోనే ఏపీకి సందర్శించాలని అనుకుంటున్నానని అంటూ జగన్ ప్రభుత్వ పాలనపై వేయినోళ్ల పొగిడేశారు.
ఒక ప్రఖ్యాత నోబెల్ గ్రహీత ఏపీ సీఎం జగన్ పాలనను మెచ్చుకోవడం ఇప్పుడు దేశంలో వైరల్ అయ్యింది. ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ పథకాలతో ప్రజల ఆర్థికవృద్ధికి సహకరిస్తున్న జగన్ పాలనకు ఇంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుందని వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.