స్పీకర్ తనకు ఉన్న విచక్షణాధికారాలతో లేదా సభ సభ్యుల విజ్జప్తి మేరకు సభలో ప్రవేశపెట్టిన బిల్లులపై పూర్తి స్ధాయిలో సమీక్ష జరపడానికి సెలక్ట్ కమిటీకి పంపిస్తారు. ఈ సెలక్ట్ కమిటీలో 15 సభ్యులకు మించకుండా ఉంటారు. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలు ఉంటారు. సభలో మెజారిటీ ఎవరికి ఉంటే వారి తరపున ఎక్కువ మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారు.
బిల్లును ప్రవేశపెట్టిన వారు కూడా ఇందులో ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ కమిటీ బిల్లుకు సంబంధించి అభిప్రాయ సేకరణ చేసి అందులో సవరణలు ఏమైనా చేయాల్సి ఉంటుందా అనే అంశాలపై నివేదికను సిద్దం చేస్తారు. ఇందుకు నెల రోజుల నుండి మూడు నెలల వరకు సమయం ఉంటుంది. అవసరమైతే ఇంకా పొడిగించే అవకాశం ఉంటుంది. సవరణలు ఏమీ లేకుండా అన్ని సక్రమంగా ఉన్నట్లయితే బిల్లును శాసన మండలిలో పాస్ చేస్తారు. ఒకవేళ సవరణలు చేయాల్సి ఉంటే ఆ బిల్లును మరలా శాసన సభకు పంపించడం జరుగుతుంది.