జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంపై స్పందించిన ఆయన తాము తచ్చుకుంటే వైసీపీ ప్రభుత్వాన్ని కూలుస్తామని, జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టేవరకు నిద్రపోనంటు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ఎక్కడకి వెళ్లదని.. రైతులకు తాము అండగా ఉంటామన్నారు.
రాజధానిలో మహిళలను రోడ్డుపైకి లాగారని, వారిపై లాఠిచార్జ్ చేశారని.. రాజధాని కోసం పోరాడుతుంటే ఇలా అమానుషంగా ప్రవర్తించడం దారుణమని వైసీపీపై మండిపడ్డారు. దీనిపై ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామని, నమ్మి ఓటు వేస్తే రైతులను నయవంచన చేస్తున్నారన్నారు.
అటు పవన్ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. కనీసం ఎమ్మెల్యేగా కూడని పవన్ కళ్యాణ్ తమ ప్రభుత్వాన్ని పడగోడతాననడం హస్యస్పదంగా ఉందని, సినిమా డైలాగులు రాజకీయాలలో పని చేయవని వైసీపీ నేతలు వాటిని తిప్పికోడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ బీజేపీతో పోత్తు పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. ప్యాకేజీ స్టార్ మాటలు తప్ప చేతలు ఉండవని మండిపడుతున్నారు.
ఇక జనసేనాని వ్యాఖ్యలపై ప్రజలలో ఆసక్తికర చర్చజరుగుతుంది. పవన్ ఇక్క ఎమ్మెల్యేతో జగన్ ప్రభుత్వాన్ని ఎలా కూల్చగలడని.. కనీసం ఏ చట్ట సభలో అర్హతలేని వ్యక్తి ఇలాంటి డైలాగులు మాట్లాడటం విడ్డురంగా ఉందని ప్రజలు అంటున్నారు. బీజేపీతో పోత్తు పెట్టుకున్న తరువాత పవన్ స్వరం పెంచారని.. సీఎం జగన్‌పై ఉన్న కేసులను అడ్డుపెట్టుకుని కేంద్రం జోక్యంతో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చుతుందని కోందరు భావిస్తున్నారు.