వెంకీమామ తో మంచి హిట్ కొట్టిన విక్టరి వెంకటేష్ ఇప్పుడు మరో మాస్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అరించేందుకు రెడీ అవుతున్నాడు..తమిళనాట సూపర్ హిట్ అయిన అసురన్ చిత్రానికి రిమిక్ గా నారప్ప చిత్రాన్ని తీస్తున్నారు.. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు..మారప్ప చిత్రానికి సంబంధిచిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.
ఈ పోస్టర్ లో వెంకటేష్ మాస్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది.. మరి తమిళనాట పెద్ద హిట్ అయిన సినిమా… టాలీవుడ్ ఏ మేరకు విజయం సాధిస్తుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే..
ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు ఎంతో ప్రాముఖ్యం అని చెప్పాలి….ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ తో తీసిన బ్రహ్మోత్సవం భారీ పరాజయం తర్వాత మళ్లీ ఆయన సినిమా రాలేదు..ఈ ఫలితం ద్వారా ఆయనకు అవకాశాలు బాగా సన్నగిల్లాయి అని చెప్పొచ్చు..మరి ఈ సినిమాతో హిట్ కొట్టి…మళ్లి తన పందాను నిరూపించుకుంటాడేమో చూడాలి.