ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ‘ఆహా’ (aha) యాప్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఉచితంగా ఈ యాప్ ను సబ్ స్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఇటీవల మార్కెట్ లో ఉన్న అనేక డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు భిన్నంగా ఆహా ఆడియన్స్ ను పలకరిస్తోంది.
ఈ యాప్ లాంచ్ చెందిన తరువాత మొదటిసారిగా నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమాను స్ట్రీమ్ చేశారు. నిఖిల్ కెరీర్ లో పెద్ద సక్సెస్ అయిన అర్జున్ సురవరం చిత్రం థియేటర్స్ లో మిస్ అయినవారు ఈ యాప్ లో చూడవచ్చు.
రీసెంట్ బ్లాక్ బాస్టర్ అర్జున్ సురవరం చిత్రాన్ని సంతోష్ దర్శకత్వం వహించగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఠాగూర్ మధు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సోషల్ మెసేజ్ తో పాటు కమర్సియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా నిఖిల్ కు మంచి పేరును తెచ్చి పెట్టింది.