ఫ్యూచర్ ప్లాన్ చెప్పేసిన రాజ్ తరుణ్

ఇప్పుడున్న కుర్ర హీరోల్లో కొందరు అనుకోకుండా స్టార్స్ అయిపోయారు. అందులో రాజ్ తరుణ్ ఒకడు. ఉయ్యాల జంపాల సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరాలనుకుంటే ఏకంగా ఆ సినిమాకు హీరో అయిపోయాడు. ఆ తర్వాత వరుస సూపర్ హిట్స్ తో దూసుకెళ్ళాడు. ప్రస్తుతం ఈ కుర్ర హీరో కెరీర్ కి బ్రేక్ పడింది. వరుసగా డిజాస్టర్స్ అందుకోవడంతో మార్కెట్ డౌన్ అయింది.

అయితే దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ‘లవర్’ తనకి మళ్ళీ ఓ సూపర్ హిట్ ఇచ్చి ఫాంలోకి తీసుకొస్తుందని భావిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాల వివరాలు ఇటివలే తెలియజేసాడు రాజ్ తరుణ్.

ఇటివలే ‘ఒరేయ్ బుజ్జిగా’ షూటింగ్ పూర్తి చేసిన రాజ్ త్వరలోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాతో పాటే రానా నిర్మాణంలో ‘డ్రీం గర్ల్’ రీమేక్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఒక సినిమా కమిట్ అయ్యాడు. వీటి తర్వాత మెగా ఫోన్ పట్టి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు రాజ్ తరుణ్. అయితే దర్శకుడిగా చేస్తే మాత్రం స్క్రీన్ మీద నటుడిగా కనిపించనని అన్నాడు. అయితే దర్శకుడిగా అన్ని జోనర్లలో సినిమాలు చేయాలనుందని కానీ హారర్ జోలికి మాత్రం వెళ్లబోనని తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *