తమిళనాట సూపర్ స్టార్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజినీకాంత్ అంటే ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ లక్షల్లో ఉంటారు. కేవలం తమిళనాటే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా రజినీకాంత్ కు అభిమానులు ఉన్నారు. రజినీకాంత్ కూడా అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉండటంతో పాటు అభిమానులకు ఎప్పటికప్పుడు కలిసేందుకు టైం ఇస్తూనే ఉంటాడు. ప్రస్తుతం రజినీకాంత్ ‘దర్బార్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ లో రజినీకాంత్ ను ఒక ఫ్యాన్ కపుల్ కలిశారు.
రజినీకాంత్ ను చూడాలని కోరుకుంటున్న ఒక లేడీ ఫ్యాన్ కోరికను ఆమె భర్త తీర్చాడు. చాలా రోజుల పాటు ట్రై చేసిన తర్వాత ఆమె 9వ నెల గర్బవతిగా ఉన్న సమయంలో రజినీకాంత్ ను కలిసే అవకాశం వచ్చింది. రజినీకాంత్ సమక్షంలో ఆమెకు శ్రీమంతం జరిగింది. దర్బార్ సెట్ లో రజినీ తన అభిమానికి గాజులు తొడిగి మరీ శ్రీమంతం సందర్బంగా ఆశీర్వదించాడు. ఆ జంటతో రజినీకాంత్ కలిసి బోజనం కూడా చేశాడంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
రజినీకాంత్ ఆ లేడీకి శ్రీమంతం సందర్బంగా గాజులు వేస్తూ ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. రజినీకాంత్ తన అభిమానుల పట్ల ఎంత ఆప్యాయంగా ఉంటాడో ఈ ఫొటను బట్టి అర్థం చేసుకోవచ్చు అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటున్నారు.
ఇక రజినీకాంత్ దర్బార్ చిత్రంను సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక పోలీస్ ఆఫీసర్ గా రజినీకాంత్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. నయనతార హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.