రంగమ్మత్త.. ఎందుకీ సైలెన్స్!

సోషల్ మీడియా కొంపలంటిస్తోంది. కొన్నిసార్లు కొంపలు కూల్చడానికి వేదిక అవుతోంది. ఈ ప్రమాదాన్ని ఏమని విశ్లేషించాలి?  స్టార్ట్ ఫోన్ చెలిమి.. సోషల్ మీడియా బులపాటం కొందరికి గుండె పోటు తెచ్చే పరిస్థితి ని కలగజేస్తోంది.

ముఖ్యంగా సెలబ్రిటీల కు సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రైవసీ అనేది లేకుండా పోయింది. ఎవరు ఎలా స్పందించినా సెలబ్రిటీలు మాత్రం ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. హద్దులు దాటారో సోషల్ మీడియాకి చిక్కినట్టే. నెటిజనుల చేతికి చిక్కి అభాసు పాలు కావాల్సిందే. దీంతో ప్రతి సెలబ్రిటీ సోషల్ మీడియా వేదిక గా స్పందించాలంటే ఒణికి పోతున్నారు.

కొందరు ఇవేమీ పట్టనట్టు గా సోషల్ మీడియా ప్రచారంలో వెనకాడడం లేదు. నిరంతరం హాట్ హాట్ ఫొటోల తో పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లలో అనసూయ ముందుంటోంది. గత కొంత కాలంగా సోషల్ మీడియా లో యాక్టీవ్ గా వుంటున్న రంగమ్మత్త తాజాగా వరుస ఫొటో షూట్ల తో రచ్చ చేస్తోంది. సదరు యాంకరమ్మ ఫొటోల కు లైక్ లు వస్తుంటే కొందరు వెకిలి చేష్టలతో ఉడికిస్తున్నారు. మరికొందరు హద్దు మీరి బార్డర్ క్రాస్ చేసి ఘాటుగా విమర్శిస్తున్నారు.

తాజాగా `మయూర` అనే నెటిజన్ అనసూయ ఫొటోల పై తీవ్రంగా విరుచుకు పడింది. “ఇలాంటి వారిని చూసి సిగ్గుతో తలదించుకుంటున్నాను“ అంటూ ఘాటుగా స్పందించింది. తనని విమర్శించేవారిపై అంతెత్తున విరుచుకుపడే అనసూయ ఈసారి ఎందుకనో సైలెన్స్ మెయింటెయిన్ చేయడం అభిమానుల్లో చర్చ కు వచ్చింది. తనని విమర్శించింది వేరొక లేడీ కాబట్టి.. తేలు కుట్టిన దొంగలా సైలెంట్ అయిపోయిందా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *