ఏపీకి 3 రాజధానులు అవసరం అని జగన్ చేసిన ప్రతిపాదనపై చంద్రబాబుతోపాటు అమరావతిలో బాబును నమ్మి వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన వారంతా ఇప్పుడు లబోదిబో మంటున్నారు.చంద్రబాబును నమ్మి తాము నిండా మునిగిపోయామా అన్న బాధ వారిని పట్టిపీడిస్తోంది.
అందుకే జగన్ 3 రాజధానులపై చంద్రబాబు షాక్ అయ్యారు. ఇలాంటి ప్రకటన వస్తుందని ఊహించలేదని.. అసలు తనకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని నిన్న రాత్రి విలేకరుల సమావేశంలో టెన్షన్ పడ్డారు. మూడు రాజధానులుంటే పనుల కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని బాబు గారు సెలవిచ్చారు.
రాజధాని ప్రకటనకు ముందే ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన అమరావతిలో చంద్రబాబు తన బినామీలు, టీడీపీ నేతలకు 4వేల ఎకరాలకు పైగా భూపందేరం చేసిన నిర్వాకాలను ఆధారాలతో సహ బయటపెట్టారు. దీంతో అమరావతి పేరిట బాబుగారు భూదందా చేశారని అర్థమైంది. ఇప్పుడు జగన్ చేసిన ప్రకటనతో వారంతా బాబుపై ఒత్తిడి తేవడం ఖాయం.. బాబును నమ్మి మునిగిపోయామని వారంతా ఇప్పుడు టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమమే చేయడానికి రెడీ అయ్యారట.. చూడాలి మరి మున్ముందు ఏం జరుగుతుందో..