ప్రతిరోజూ పండగే మూవీ రివ్యూ

చిత్ర లహరి వంటి సూపర్ హిట్ సినిమా తరువాత సుప్రీమ్ హీరో సాయి తేజ్ నుంచి వచ్చిన సినిమా ప్రతిరోజూ పండగే.. మెగా ఫాన్స్, మాస్ అభినానులని తన సినిమాలతో ఇప్పటి వరకు ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన సాయి తేజ్ ఈ సారి అన్ని వర్గాల ప్రేక్షకుల కోసం.. మరీ ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ కోసం మారుతీ డైరెక్షన్ లో చేసిన ఈ మూవీ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

5 వారాల్లో చనిపోవడానికి రెడీ గా ఉన్న తండ్రి…..! తండ్రి చనిపోతాడు అని తెలిసినా కనీసం అతని చివరి రోజుల్లో కూడా దగ్గరుండటానికి కూడా కనీసం ప్రయత్నం చేయని పిల్లలు…! కానీ తాత చనిపోబోతున్నాడు అని తెలిసి అతన్ని తన చివరిరోజుల్లో హ్యాపీ గా ఉంచడానికి ప్రయత్నించే మనవడు…! సింపుల్ గా చెప్పాలి అంటే ఓ తాత..! తండ్రి..! కొడుకు మధ్య సాగే ఎమోషనల్ ఫామిలీ స్టోరీ యే ప్రతి రోజు పండగే..! ఐతే ఈ కథ ని మారుతీ తన డైరెక్షనల్ స్కిల్స్ తో, కామెడీ టైమింగ్ తో ఎలా రక్తి కట్టించాడు, ఈ త్రైఅంగెల్ డ్రామా లోకి హీరోయిన్ ఎలా వచ్చింది, అసలు హీరోయిన్ కి హీరో కి పరిచయం ఎలా అవుతుందో తెలియాలి అంటే మాత్రం థియేటర్ కి వెళ్లాల్సిందే.

విశ్లేషణ :

తాత… తండ్రి.. కొడుకు మధ్య సాగే ఒక సింపుల్ కథ కి ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని ఒక కొత్త పాయింట్ ని జోడించి… ఎవరు మనోభావాలు దెబ్బ తినకుండా, తన అనుకున్న విషయాన్ని ఎంతో హాయి గా చెప్పేసాడు డైరెక్టర్ మారుతీ… ఇలాంటి సున్నితమైన కథలు ఎంచుకొన్నపుడు, ఆ కథని సినిమాగా మలచాలి అనుకున్నపుడు చాల జాగ్రతాలు తీసుకోవాలి.. యే మాత్రం అటు ఇటు అయినా చెప్పాలనుకున్న విషయం కాస్త తప్పు గా అర్ధం అయ్యే అవకాశం ఎక్కువ..! కానీ మారుతీ మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు, ఈ టిపికల్ లైన్ కి తన కామెడీ టైమింగ్ జత చేసి, థియేటర్ లో నవ్వుల జాతర చేయించాడు. అసలు ఇది ఓ ఫామిలీ టైపు సినిమా అనే థాట్ వచ్చే లోపే తన స్క్రీన్ ప్లే మేజిక్ తో మారుతీ సినిమా ను ఆద్యంతం హాయి గా నడిపించాడు. తన తొలి సినిమాలు ద్వారా తన ఫై పడ్డ ముద్ర ని చెరుపుకుంటూ వస్తున్న మారుతికి ప్రతి రోజు పండగే ఓ పెద్ద రిలీఫ్ అని చెప్పి తీరాలి.

కమర్షియల్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు కూడా మారుతి హాండెల్ చేయగలడు అనే రీతిన ప్రతి రోజు పండగే ను తెరకేక్కిన్చాడు. మారుతీ చెప్పిన కథకి ఓకే చేసి ఆయా పాత్రల్లో నటీనటులు నటించారు అనే కంటే జీవించారు అనే చెప్పచు.. ముఖ్యంగా సత్య రాజ్, రావు రమేష్ ఈ సినిమాకి షో స్టోప్పేర్స్ అనాలి.

తాత పాత్రలో సత్య రాజ్, అతని కొడుకు పాత్రలో రావు రమేష్ నువ్వు నేనా అనే రీతిన నటించారు. సినిమా పతాక సన్నివేశాలో వీరిద్దరి నటన తార స్థాయికి చేరింది. గుండెను హత్తుకునే మాదిరి వీరి నటన పలికించిన హావభావాలు బాగా ఆకుట్టుకున్నాయి.

ఇక సాయి తేజ్ ఈ సినిమాలో చాల పరిణితితో కూడిన నటన కనబరిచాడు. ముందు సినిమాలు కంటే ఈ సినిమాలో కూడా సాయి తేజ్ లుక్స్ పరం గా కూడా బావున్నాడు. బరువు తగ్గి సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేసాడు. అలానే ఈ సినిమాతో సాయి తేజ ఫామిలీ ఆడియన్స్ లోకి కూడా వెళ్లిపోవడం ఖాయం గానే కనిపిస్తుంది. అటు మాస్ కోసం స్టైలిష్ ఫైట్స్ చేస్తూ ఇటు క్లాస్ కోసం కొన్ని సెంటిమెంట్ సన్నివేశాల్లో చక్కగా నటిస్తూ ఆకట్టుకున్నాడు సాయి తేజ్.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ రాశి ఖన్నా కి ఒక విభిన్నమైన పాత్ర దొరికింది అని చెప్పవచ్చు. టిక్ టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నే గా రాశి థియేటర్ మొత్తం గోల పెట్టించింది. రాశి మల్లి కనిపిస్తే బావ్న్ను అనే రీతిన ఈ క్యారెక్టర్ ని తన నటనతో పండించింది రాశి.

నటీనటులతో పాటు ఈ సినిమాకి థమన్ ఇచ్చిన రి రికార్డింగ్ చాల పెద్ద అసెట్, తకిట తకిట సాంగ్, చిన్నతనమే అంటూ వచ్చే పాటలు బాగా ఆకట్టుకుంటాయి. ఇక జయ కుమార్ సంపత్ కెమెరా వర్క్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అన్ని కలిపి ప్రతి రోజు పండగే చిత్రాన్ని మరింత అందంగా, ఆకట్టుకునేలా మార్చేశాయి. ప్రతి మనిషి జీవితం లో పుట్టుకని, చావుని ఎవరు తప్పించలేరు, పుట్టకను ఎంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటామో, చావుని కూడా నవ్వుతూ ఆహ్వానించాలి, మనవాళ్లు పోయారు అనే బాధ కంటే, పోతున్నారు అనే భయం కంటే, వారు ఉన్నన్నాళ్ళు హాయిగా సంతోషం గా చూసుకోవాలి, వారి జివించే ప్రతి రోజు ని పండుగల మార్చాలన్నదే ఈ సినిమా.. ఇలాంటి సందర్భాలు ఎదురైనా ప్రతి ఒక్కరికి, ఇలాంటి అనుభవాలు ఉన్న ప్రతి కొడుక్కి, తండ్రికి, తాతకి కచ్చితంగా ప్రతిరోజు పండగే నచ్చుతుంది.

బాటమ్ లైన్ : మనసు హత్తుకునే చిత్రం

రేటింగ్ : 3/ 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *