ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్ పై రజనీ రెడ్డి నిర్మాణంలో నూతన దర్శకుడు స్త్రీ లంక చందు సాయి తెరకెక్కిస్తున్న చిత్రం చరిత కామాక్షి. రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నవీన్ బేతిగంటి, దివ్య శ్రీపాద లీడ్ రోల్స్ చేస్తున్నారు. చరిత కామాక్షి అనే టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామాగా రాబోతుందని ప్రకటించడంతో ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే చరిత కామాక్షి ఫస్ట్ లుక్ తాజాగా విడుదలై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో లీడ్ పాత్రలు పోషించిన నవీన్ బేతిగంటి, దివ్య శ్రీపాదలు స్టిల్స్ తో పొయెటిక్ ఫీల్ వచ్చేలా ఈ ఫస్ట్ లుక్ ని డిజైన్ చేశారు దర్శకులు స్త్రీ లంక చందు సాయి. యూత్ ఫుల్ ఆడియెన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని సంపూర్ణంగా ఆకట్టుకునే రీతిన ఈ సినిమాను దర్శకుడు స్త్రీ లంక చందు సాయి తెరకెక్కించారని నిర్మాత రజనీరెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల కానున్నాయి
తారాగణం
దివ్య శ్రీపద
నవీన్ బేతిగంటి
పృథ్వీ రాజ్
మణికంఠ వారణాశి
సునితా మనోహర్
సతీష్ సారిపల్లి
అంజి మామా
సాంకేతిక వర్గం
నిర్మాణం: ఫైర్ ఫ్లై ఆర్ట్స్ (FireFly Arts)
నిర్మాత: రజిని రెడ్డి
సినిమాటోగ్రాఫర్: రాకీ వనమాలి
సంగీతం: అబు
ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్
రచన: జ్ఞానేశ్వర్ దేవరపాగ, శివ శంకర్ చింతకింది
పాటలు: కూచి శంకర్, మనోహర్ పాలిసెట్టి, వాసు వలబోజు, జ్ఞానేశ్వర్ దేవరపాగ
ఆర్ట్ డైరెక్టర్: రమేష్
కాస్ట్యూమ్స్: దేవి, భవాని నీరటి
సౌండ్ డిసైన్: షఫీ fx
ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్: శివ MSK
ప్రొడక్షన్ మేనేజర్: స్వర్ణ
పోస్టర్ డిజైనర్: ఓంకార్ కడియం
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
డైరెక్టర్: స్త్రీలంక చందు సాయి