పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు ప్రతిపనికి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో విశాఖ, విజయనగరం జిల్లాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో దాడులు చేసింది.
విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేసింది ఏసీబీ. పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు ప్రతిపనికి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టింది ఏసీబీ. 12 గంటలకు మొదలైన ఆకస్మిక దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.
విశాఖ జిల్లాలో విశాఖ రూరల్, అర్బన్, అచ్యుతాపురం, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభ మండల కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నాయి. ఇక విజయనగరం జిల్లాలో పూసపాటి రేగ, శృంగవరపు కోట, జామి, కొత్తవలస, భోగాపురం, డెంకాడ మండలాల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.