రవిప్రకాష్ మరో ఇద్దరు కలిసి అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి రూ.18 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఉపసంహరించుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దీని ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. అందుకు సంబంధించి తాజాగా రవిప్రకాశ్ ను తమ ఎదుట హాజరు అయ్యేలా ఆదేశించాలని నాంపల్లి సీఎంఎం కోర్టు ఆశ్రయించింది ఈడీ. ఎబిసిపిఎల్ కేసు సంబంధించిన విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాలని గత ఏడాది జనవరి 13,27, ఫిబ్రవరి 7,9 తేదీ ల్లో సమన్లు జారీ చేసినా రవిప్రకాష్ విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగతంగా ఈమెయిల్ ద్వారా సమన్లు అందుకున్న రవిప్రకాశ్ విచారణకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈడి అధికారులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా తాము కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని సమన్లలో కోరిన ఈడి. ఈ సమన్లకు రవి ప్రకాష్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇప్పటి వరకు ఈడి సమన్లకు సమాధానం లేనందున ఐపీసీ 174, 175 సెక్షన్ల కింద రవిప్రకాశ్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ రెండు సెక్షన్ల కింద కనిష్టంగా నెల రోజుల సాధారణ జైలు శిక్ష నుంచి ఆరు నెలల వరకు సాధారణ జైలు శిక్షతోపాటు జరిమానా విధించాలని వారు కోర్టును కోరారు.