డిస్నీ – మార్వెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించే అవెంజర్స్ తదితర సూపర్ హీరో సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సూపర్ హీరో సినిమాల సిరీసుల్లో ఐరెన్ మాన్ సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఐరెన్ మాన్ మూవీ సిరీస్ తో పాటు అవెంజర్స్ మూవీ సిరీస్ లో కూడా ఐరెన్ మాన్ కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్, అయితే అవెంజన్ ఎండ్ గేమ్ లో ఐరెన్ మ్యాన్ క్యారెక్టర్ కూడా ముగిసిపోతుంది. అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ తరువాత వచ్చిన మార్వెల్ సూపర్ హీరో సినిమాల్లో ఐరెన్ మ్యాన్ తిరిగివస్తాడనే ఊహాగానాలు వినిపిస్తూ వస్తున్నాయి, వాటికి మరింత ఊతం ఇచ్చే రీతిన మార్వెల్ స్టూడియోస్ వారి నుంచి వస్తున్న డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ చిత్రంలో ఐరన్ మాన్ తిరిగి వస్తున్నాడని తెలిసింది. ఈ పాత్రను ప్రముఖ ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ పోషిస్తున్నారు అనే వార్తలు ఇప్పుడు అంతటా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా విడుదలైన డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మే 6న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వనుంది.