శతాధిక చిత్ర దర్శకుడు కీర్తిశేషులు శ్రీ కోడి రామకృష్ణ గారు దర్శకుడిగా ఎలాంటి చిత్రాలు తీసారో చెప్పనక్కర్లేదు. ఫిల్మ్‌నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్ళిన ప్రతిఒక్కరికి కోడి రామకృష్ణ గారి చరిత్ర తెలుస్తుంది. అయితే ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఆయన పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత గా బాధ్యతలు చేపట్టడమే కాకుండా దర్శకురాలు గా తండ్రి ఆశయ సాధనకి తొడుగా నిలబడ్డారు. ఇటీవలే ఎస్ ఆర్ కళ్యాణమండపం చిత్రం తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా నేను మీకు బాగా కావాల్సినవాడిని అనే చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. విజయనిర్మల, జీవితారాజశేఖర్ లాంటి లేడి దర్శకుల తరువాత ఇండస్ట్రినుండి వచ్చే లేడి దర్శకుల లిస్ట్ లో కోడి దివ్య దీప్తి నిలవనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటిలుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తేనే మనకి అర్ధమవుతుంది కోడి రామకృష్ణ గారి దర్శక వారసురాలుగా దివ్య దీప్తి నిలబడుతుందని. అన్ని వర్గాల ప్రేక్షకులని దియెటర్స్ రప్పించే విధంగా ఈ చిత్రం వుండబోతుంది. కిరణ్ అబ్బవరం లవర్ బాయ్ లుక్ చూసిన ప్రేక్షకులు ఒకే సారిగా మాస్ కమర్షియల్ లుక్ లో అందర్ని ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ లో వున్న కమర్షియల్ హీరోల సరసన చేరేలా ఈ లుక్ వుండటం విశేషం. ఈ సినిమాకి సంబందించిన ఎక్సైట్‌మెంట్ న్యూస్ లు మరి కొన్ని రొజుల్లో తెలియజేస్తారు.