ఫిబ్ర‌వ‌రి 18న థియేట‌ర్ల‌లో స్పైడ‌ర్ మాన్ ఫేమ్ టామ్ హోలెండ్ న‌టించిన యాక్ష‌న్ మూవీ అన్ ఛార్టెడ్

లేటెస్ట్ జెనరేష‌న్ స్పైడ‌ర్ మ్యాన్ గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న టామ్ హోలెండ్ అన్ ఛార్టెడ్ అనే హైవోల్టేజ్ యాక్ష‌న్ మూవీలో న‌టించారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత అన్ ఛార్టెడ్ అనే వీడియోగేమ్ ఆధారంగా ఈ సినిమా అదే టైటిల్ తో ఫిబ్ర‌వ‌రి 18న థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతుంది. ట్రెజర్ హంట్ నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు. స్పైడ‌ర్ మ్యాన్ ఫ్యాన్స్ తో పాటు ఒళ్లు గగ్గురుప‌రిచే యాక్ష‌న్ స‌న్నివేశాలు ఇష్ట‌ప‌డే సినీ అభిమానుల్ని అన్ ఛార్టెడ్ అల‌రించ‌నుంది. ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ, మ‌ళ‌యాలీ భాష‌ల్లో విడుద‌ల అవ్వ‌నుంది. ఈ సినిమాలో దాదాపు మెజార్టీ యాక్ష‌న్ స‌న్నివేశాలు కోసం హీరో టామ్ హోలెండ్ వంద‌ల అడుగుల ఎత్తులో ఎలాండి డూబ్ లేకుండా న‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *