విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న సినిమా బతుకు బస్టాండ్. నికిత అరోరా, శృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇలవల ఫిల్మ్స్ పతాకం పై చక్రధర్ రెడ్డి సమర్పణలో IN రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. బతుకు బస్టాండ్ అనే టైటిల్ పెట్టినట్లుగా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అటు సాధరణ ప్రేక్షకులతో పాటు తెలుగు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా పై ఆసక్తి పెరిగుతూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ కంటెంట్ కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభిస్తోంది. ఇటీవలే విడుదలైన రెండు పాటలకు యూట్యూబ్ లో విశేషాదరణ అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ట్రైలర్ కు సోషల్ మీడియాతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉందని చిత్ర దర్శకుడు ఐ.ఎన్. రెడ్డి తెలిపారు. కంటెంట్ తో పాటు కమర్శీల్ ఎలిమెంట్స్ జోడించి ఆడియెన్స్ కి ఎడ్చ్ ఆఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే రీతిన ఈ సినిమాను రూపొందించినట్లుగా నిర్మాతలు ఐ కవితా రెడ్డి, కే మాధవి అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం ముగిసిందని, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాతలు తెలిపారు.
నటీనటులు:
విరాన్ ముత్తంశెట్టి, నికిత అరోరా, శృతి శెట్టి తదితరులు
టెక్నికల్ టీం:
బ్యానర్ : ఇలవల ఫిల్మ్స్
సమర్పణ : K చక్రధర్ రెడ్డి
రచన, దర్శకత్వం : I.N. రెడ్డి
నిర్మాతలు : I.కవితా రెడ్డి, K.మాధవి
డిఓపి : వాస్ కమల్
సంగీతం : మహవీర్
పీఆర్ఓ : ఏలూరు శ్రీను & మేఘ శ్యామ్
కొరియోగ్రఫీ : శివాజీ
యాక్షన్ : శంకర్.U