వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఎంపీ, కేంద్రమంత్రిగా వెలుగు వెలిగి పారిశ్రామికవేత్తగా కొనసాగుతున్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. తాజాగా మంగళవారం ఉదయం ఆయనపై సీబీఐ దాడులు జరుగుతున్నాయి. రాయపాటి ఇల్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. మంగళవారం ఉదయం నుంచి సీబీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇండియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు లో భాగంగా ఈ సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. రాయపాటి తోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సీఈవో లో ఎండీ ఆస్తులపై కూడా సోదాలు నిర్వహిస్తోంది.
300 కోట్ల రూపాయల బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రాయపాటి సాంబశివరావు బ్యాంకులకు రుణం చెల్లంచకుండా ఎగ్గొట్టడంతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది.
రాయపాటి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ తో పాటు పలు కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు. ట్రాన్స్ ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్ ఇంట్లో సైతం సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ, గుంటూరు ఢిల్లీలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
బ్యాంక్ లను మోసం చేసిన వ్యవహారం లో రాయపాటి ఫై గతం లోనే సీబీఐ కేసు నమోదైంది.