దిశ ఉదంతం అనంతరం ఆడపడుచుల రక్షణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్ గారు ప్రవేశ పెట్టిన దిశ చట్టం ఇక మృగాళ్ల పాలిట మరణ శాసనం గా మారనుంది. కామాంధుల పాలిట కాలసర్పంగా కాటేయనుంది. విచక్షణ కోల్పోయిన ప్రతి దుర్మార్గుడి వెన్ను విరచనుంది.
దోషులు తప్పించుకోకుండా, విచారణలో అవకతవకలు జరగకుండా, శిక్ష విధించడంలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన నేరస్తులను పట్టుకుని శిక్షించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు ప్రారంభం కానున్నాయి. మృగాళ్ల పాలిట యమపాశాలు గా మారనున్నాయి.
ఈ మేరకు ‘దిశ చట్టం’ పరిరక్షణకు ప్రత్యేక అధికారి గా నియమితులైన కృతికా శుక్లా అడుగులు ముందుకేసి జిల్లాకొక మహిళా పోలీస్ స్టేషన్, బోధనాస్పత్రుల్లో మెడికల్ సెంటర్లను ఏర్పాటుచేసి, ఆరు గంటల్లో వైద్య నివేదిక అందేలా, 21 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా కొరడా ఝుళిపించబోతున్నారు. ఈ నెల 7 నుండి దిశ యాప్ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇకనుండి దిశ చట్టం మృగాళ్ల పాలిట మరణ శాసనమే.