2017 లో ఏ నిర్మాత చేయని ఓ సాహసం చేసి ఆయనకంటూ సెపరేట్ రికార్డు నెలకొల్పుకున్నాడు దిల్ రాజు. అవును ఒకటి కాదు రెండు కాదు ఆ ఏడాది దిల్ రాజు బ్యానర్ నుండి ఏకంగా ఆరు సినిమాలు విడుదలయ్యాయి. నిజానికి ఇదొక అరుదైన రికార్డు. ఒకే ఏడాదిలో ఆరు సినిమాలు రిలీజ్ చేయడం అంటే ప్రొడక్షన్ కాస్ట్ పేలిపోతుంది. అయినా తట్టుకొని సినిమాలు తీసి ఆరు హిట్స్ అందుకున్నారు.
అయితే ఈ ఏడాది కూడా రాజు గారు ఐదు సినిమాలు టార్గెట్ పెట్టుకొని సినిమాలు చేయాలనుకున్నారు. కానీ ఎందుకో ఈసారి ఆ టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాడు. ‘F2’ – ‘మహర్షి’ – ‘ఇద్దరి లోకం ఒకటే’ ఈ ఏడాది ఈ మూడు సినిమాలతోనే సరిపెట్టుకున్నాడు. ఈ ఇయర్ మిస్సయిన టార్గెట్ ని మాత్రం వచ్చే ఏడాది పక్కగా అందుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే నాని ‘V’ – శర్వా ’96’ సెట్స్ పై ఉన్నాయి. ఇవి కాకుండా వినాయక ‘సీనయ్య’ అవసరాల తో ఒక సినిమా త్వరలోనే షూటింగ్ కి రెడీ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండతో పాటు తమ్ముడు శిరీష్ కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే రాజు గారు ఈ సారి ఆరు సినిమాల టార్గెట్ అవలీలగా అందేసుకునేలా ఉన్నారు.