నిఖిల్ లైవ్ వెనక బిగ్ గేమ్ ప్లాన్?

సెన్సిటివ్  డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంపౌండ్ హీరోల్లో నిలదొక్కుకోగలిగిన ఏకైక హీరో నిఖిల్. హ్యపీడేస్ బ్యాచ్ హీరోల్లో సెలెక్టివ్ గా కథల్ని ఎంచుకుంటూ కొత్త తరహా చిత్రాల్ని ప్రేక్షకుల కు అందిస్తూ హీరోగా కెరీర్ ని మలుచుకున్నాడు. అయితే హిట్ సినిమా పడిన ప్రతిసారి నిఖిల్ కెరీర్ లో మొదటి సినిమా తరహా లో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. `ఎక్కడి కి పోతావు చిన్నవాడా` సినిమా సమయం లో నిఖిల్ ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ప్రయాస పడాల్సి వచ్చింది. అన్ని అడ్డంకుల్ని అధిగ మించి రిలీజ్ అయిన ఆ సినిమా అనూహ్య విజయాన్ని సాధించి నిఖిల్ కెరీర్ కి బూస్ట్ నిచ్చింది.

హిట్టొచ్చిన ప్రతిసారి నిఖిల్ ఆ తరవాత సినిమా కోసం కనిపించని యుద్ధమే చేస్తున్నాడు. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` చిత్రం తరువాత కేశవ- కిరాక్ పార్టీల తో ఆకట్టుకోవాలని చూసినా  పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఆ తరువాత చేసిన `అర్జున్ సురవరం` రిలీజ్ ఇబ్బందుల్లో పడటం తో నిఖిల్ కష్టం మళ్లీ మొదటి కి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా బయటికి వస్తుందా?…వస్తే హిట్ అవుతుందా? లాంటి ప్రశ్నలెన్నో యువ హీరో ని వెంటాడాయి.

అయినా ఎక్కడా అధైర్య పడక సినిమా పై గట్టి నమ్మకం తో తాను అనుకున్నది సాధించుకున్నాడు నిఖిల్. అతని నమ్మకం నిజమై `అర్జున్ సురవరం` అన్ని అడ్డంకుల్ని అధిగమించి నవంబర్ 29న రిలీజ్ అవ్వడమే గాక.. క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకుని మంచి విజయాన్ని సాధించింది. అయితే తాజాగా నిఖిల్ క్యాచ్ మి లైవ్ .. అంటూ 28 సాయంత్రం హంగామా ఎందుకు చేయబోతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు.

అర్జున్ సురవరం రిలీజ్ ముందు రకరకాల ఎమోషన్స్ బయటపడ్డాయి. నిఖిల్ పై ఏదో ఒక చెడు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో సాగింది. దాని వెనక కారణం ఏమిటి? అన్నది ఎవరికీ బోధ పడలేదు. అయితే తనపైనా తన సినిమాల పై కావాలనే ఇలా ప్రచారం జరుగుతోందని లైవ్ లో నిఖిల్ చెప్పబోతున్నాడా? లేక ఇన్ని అడ్డంకులు ఎదురైనా తన సినిమాలని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పడానికి మాత్రమే లైవ్ లోకి వస్తున్నాడా? లేక కొత్త సినిమా సంగతుల్ని చెప్పడానికి లైవ్ లోకి వస్తున్నాడా? లేదూ ఇలాంటి లైవ్ కార్యక్రమాల తో ఫ్యాన్ బేస్ ని పెంచుకోవాలన్న వ్యూహం ఇంకేదైనా ఉందా? అన్నది తెలియాలంటే నేటి (28 డిసెంబర్) సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *