స్టార్ హీరోయిన్ ఎందుకలా ఏడ్చేసింది!

టీవీ రియాలిటీ షోల్లో సెలబ్రిటీ ఉద్వేగాలు రెగ్యులర్ గా చూస్తున్నదే. జడ్జీలు సహా యాంకర్లు.. పార్టిసిపెంట్లు ఆడియెన్ కి కంట తడి పెట్టించేస్తుంటారు. ఇప్పుడు ఏకంగా ఓ టీవీ రియాలిటీ షోలో స్టార్ హీరోయిన్ కంట తడి పెట్టించేయడం చర్చకు వచ్చింది. తాను వలవలా ఏడ్చిందే గాక అందరికీ కంటతడి పెట్టించిన ఘటన ఇది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకుల గురించి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో రణబీర్ కపూర్ తో ప్రేమాయణం అటుపై ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పి రణ్ వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లాడేయడం విధితమే. ప్రస్తుతం వ్యక్తిగత జీవితం…వృత్తిగత జీవితం రెండు సంతోషంగానే సాగుతున్నాయి. కానీ ఇంకా దీపికను తొలి వలపు బాణం వదిలిపెట్టడం లేదు. తొలి ప్రేమ మధురాను భుతుల్ని వాస్తవంగానే ఎవరైనా మర్చిపోవడం సాధ్యం కాదు. ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా మనసు చిద్రమైపోతుందని  బ్రేకప్ ప్రేమికులు చెబుతుంటారు. అలాంటి అనుభవాలు దీపిక కు రణబీర్ తో ఎన్నో ఉన్నాయి. రణవీర్ ని పెళ్లాడినా పాత ప్రేమికుడు రణబీర్ ను మర్చిపోవడానికి దీపిక ఎంతగా నలిగిపోయిందో ఓ సందర్భంలో ఆవేదనగా వెల్లడించింది.

ప్రేమ మనిషిని నిజంగానే పిచ్చి వాళ్లను చేస్తుందని  కన్నీటి పర్యంతమైంది. అందుకే పాత జ్ఞాపకాలకు వీలైంతన  దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంటానని అంటోంది. అయితే సరిగ్గా అవే జ్ఞాపకాలను కొంత మంది డ్యాన్సర్లు దీపికకు గుర్తు చేసారు. ఛపాక్ ప్రమోషన్ లో భాగంగా ఓ డాన్స్ రియాలిటీ షోకు హాజరైంది. ఈ సందర్భంగా కంటెస్టెంట్లు దీపిక నటించి పాటలకు ఆమె స్టైల్లోనే హావభావాలతోస్టెప్పులు వేసి మైమరిపించారు. దీంతో వారి ప్రేమకు దీపిక పొంగిపోయింది. అంతేనా మాజీ ప్రియుడు జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో ఒక్కసారిగా భావోద్వేగాన్ని అదుపుచేసుకోలేక వలవలా ఏడ్చేసింది. వేదికపైనే కొన్ని నిమిషాల పాటు కన్నీటి పర్యంతమైంది. దీపిక గతంలో పలు ఇంటర్వూల్లో  ప్రేమకు సంబంధించిన జ్ఞాపకాల్లోకి వెళ్లినప్పుడు భావోద్వేగానికి గురైన సందర్భాలున్నాయి. అయితే తాజాగా ఆ వేదికపైనా దీపిక మరింత ఎమోషన్ కు గురవ్వడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *