సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్ధించిన టిఎస్సార్ !

సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల లో చివరి రోజు మాట్లాడుతూ ..విశాఖ కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావచ్చు అని కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ రావచ్చు అని చెప్పారు. అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి లో ఉండచ్చు అని కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆలా సీఎం జగన్ మూడు రాజధానులు అంటూ ప్రకటించినప్పటి నుండి ఏపీలో ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే ..మరి కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అలాగే అమరావతి లోనే రాజధాని ని కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత ప్రజలు రాజధానికి భూములిచ్చిన రైతులు గత పది రోజులుగా ధర్నాలు చేస్తున్నారు.

ఇక పోతే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై తాజాగా టి సుబ్బరామి రెడ్డి తన స్పందనని తెలియజేసారు. టి సుబ్బరామిరెడ్డి ది నెల్లూరు అయినప్పటికీ అయన చాలా రోజుల క్రితమే విశాఖ లో సెటిల్ అయి పోయారు. ఇప్పటికీ ఆయన పుట్టిన రోజు తో పాటు మహా శివరాత్రి వేడుకలు విశాఖ వేదిక గానే ప్రతీ ఏడాది చాలా గొప్పగా నిర్వహిస్తారు. మూడు రాజధానుల విధానం తో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుంది అని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అంటూ తెలిపారు.

విభజన వల్ల అన్నీ కోల్పోయినా ఆంధప్రదేశ్ లో విశాఖపట్నం లాంటి గొప్ప సిటీ ఉండడం విషయం అని సీఎం జగన్ చెప్పినట్టు విశాఖ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే వచ్చే పదేళ్ళలో దేశంలో నంబర్ వన్ మెగా సిటీగా వైజాగ్ మారుతుంది అని చెప్పారు. విశాఖపట్నం ఎందరినో పారిశ్రామిక వేత్తలను పరిచయం చేసిందని రాజధాని కనుక అయితే విశాఖ లో పరిశ్రమలు పెట్టుబడులు పెద్ద ఎత్తున వెల్లువలా వస్తాయని ఆయన అంటున్నారు. ఆలాగే అమరావతి ని అభివృద్ధి చేయడం కంటే ప్రస్తుతానికి అన్ని వనరులు ఉన్న విశాఖ ను రాజధాని చేసుకోవడం ఉత్తమమని కూడా తన అభిప్రాయాన్ని ఒక్క ముక్కలో చెప్పేసారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఒక కాంట్రాక్టర్ గా తన జీవితాన్ని ఆరంభించిన సుబ్బరామి రెడ్డి గారు విశాఖ అభివృద్ధి లో తన వంతు పాత్ర పోషించారు. ఏదేమైనా కూడా జనవరి 3 న ఏపీ క్యాబినెట్ తీసుకునే నిర్ణయం పై అంతా ఆధార పడి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *