ప్రపంచస్థాయి రాజధాని కడతానన్న చంద్రబాబు పేక మేడలకు పరిమితమైనది కాక పర్యటిస్తాడంట! అసలు ఎప్పుడూ అమరావతిలో ఉండే చంద్రబాబు ప్రత్యేకంగా పర్యటించాల్సిన అవసరం ఏమిటో… రాజధానిని స్మశానంతో పోల్చారని బొత్సా గారిపై గింజుకుంటున్న చంద్రబాబు గారు అక్కడ ఏముందో చూపించమంటే మాత్రం ఎందుకు గుటకలు మింగుతున్నాడు?
ఎందుకంటే అక్కడ గ్రాఫిక్స్ తప్ప ఏమి లేదు కాబట్టి…
ఉంటే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని చౌదరి అమరావతి లో గేదెలు ఎందుకు మేపాడో చెప్పు బాబూ… ఎంతో గొప్పగా చూసుకోవాల్సిన రాజధానిలో బీర్ బాటిళ్లు కుప్పలుగా పోసే నిర్లక్ష్యానికి ఎందుకు దిగజారిందో చెప్పు బాబూ…
ప్రపంచ భ్రమరావతి కి ఐదేళ్లలో ఖర్చు చేసిన 5 వేల కోట్లలో 2 .40 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా రాజధాని కి లక్ష 9 వేల కోట్లతో ప్రణాళికలు వేసి 5ఏళ్లలో దాదాపు 5 వేల కోట్లు(4900 ) కోట్లు మాత్రమే ఎందుకు ఖర్చు చేశావ్ బాబూ….
2 .40 లక్షల కోట్లలో కేంద్రం ఇచ్చిన 2500 కోట్లు తీసేస్తే నువ్వు ఖర్చు పెట్టింది ఎంత చంద్రబాబూ… ఒక్క శాతం ఖర్చు చేసి నువ్వు కట్టింది చిన్న వర్షానికే నీరు కారే రెండు తాత్కాలిక అసెంబ్లీ సెక్రటేరియట్ ఆమాత్రానికి నువ్వేదో ఇంధ్రభవనం కట్టానని బడాయిపోతే ఎలా చంద్రబాబూ.