యంగ్ మెగా హీరో పంజా వైష్ణ‌వ్ తొలి చిత్రం ఉప్పెన రిలీజ్ సంద‌ర్భంగా శుభాభినంద‌న‌లు – టీమ్ ఆదిత్య మ్యూజిక్

తెలుగు చిత్ర సీమలో ప్ర‌ముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు వేసిన ముద్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గ‌త 30 ఏళ్లుగా అనేక బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు సంబంధించిన పాట‌ల్ని తెలుగు సినీ అభిమానులకి చేర‌వేయ‌డంలో ఆదిత్య మ్యూజిక్ వారు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. కోవిడ్ క్రైసిస్ త‌రువాత తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఇప్పుడిప్పిడే మెల్ల‌గా సాధ‌ర‌ణ స్థితికి వ‌స్తోంది. క‌రోనా సృష్టించిన సంక్షోభం కార‌ణంగా ఆగిపోయిన అనేక సినిమాలు ఈ ఏడాది థియేట‌ర్ల‌లో రిలీజై అభిమానుల్ని అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ నేపథ్యంలో యంగ్ మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన ఉప్పెన సినిమా ఫిబ్ర‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకి రాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో ఇప్ప‌టికే ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ఈ ఆల్బ‌మ్ లో ఉన్న నీ క‌ళ్లు నీలి స‌ముద్రం, ద‌క్ ద‌క్ ద‌క్ వంటి పాట‌ల‌కు ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ లో కోట్ల కొద్దీ వ్యూస్ రావ‌డం విశేషం. మెగా అభిమానుల గుండెల్లో గ‌త మూడు ద‌శాబ్ధులుగా ఆదిత్య మ్యూజిక్ కి ఓ ప్రత్యేక‌మైన స్థానం ఉంది.

మెగాస్టార్ చిరంజీవిగారు న‌టించిన ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మెగా అభిమానుల‌కి చేరువైయ్యాయి. వాటిలో జ‌గ‌దీక వీరుడు అతిలోక సుంద‌రి, ఇంద్ర‌, ఠాగూర్, శంక‌ర్ దాదా ఎమ్ బి బి ఎస్ వంటి ఇండ‌స్ట్రీ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా తెలుగు చిత్ర సీమ‌లోకి అడుగుపెడుతున్న పంజా వైష్ణ‌వ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన ఆడియో సైతం ఆదిత్య మ్యూజిక్ ద్వారానే విడుద‌ల అవ్వ‌డం, రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ కంపోజ్ చేసిన ఈ పాట‌ల‌కి మెగా అభిమానుల‌తో పాటు, సాధ‌ర‌ణ ప్రేక్ష‌కులు అద్భుతంగా ఆద‌రించ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేశ్ గుప్తా, ఆదిత్య గుప్తా మాట్లాడుతూ ఫిబ్ర‌వరి 12న థియేట‌ర్స్ లో విడుద‌ల అవ్వ‌బోతున్న ఉప్పెన చిత్రం మా సంస్థ ద్వారా విడుద‌లై విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది, ఈ అవ‌కాశాన్ని మాకు అందించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ వారికి, ఉప్పెన చిత్ర బృందానికి సినిమా థియేట‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా నా శుభాభినంద‌న‌లు, ఈ సినిమా ఆడియోకి మించిన స‌క్సెస్ అందుకోవాల‌ని ఆదిత్య మ్యూజిక్ బృందం మ‌నఃస్పూర్తిగా కోరుకుంటుంది అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *