విభిన్నమైన చిత్రాలు చేస్తూ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరుని సంపాయించిన నందు విజయ్‌కృష్ణ హీరోగా, యాంకర్ గా, హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న రష్మి హీరోయిన్ గా చేస్తున్న చిత్రం బొమ్మ బ్లాక్‌బస్టర్. ఈ చిత్రాన్ని విజయీభవ ఆర్ట్స్ పతాకం పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు రాజ్ విరాట్ పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం టీజర్ తో అటు ఆడియెన్స్ లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అనూహ్య స్పందన అందుకున్నారు. ట్రేడ్ లో కూడా బిజినెస్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే నేడు బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం ఆడియో ఆల్బమ్ నుంచి రెండు సాంగ్స్ విడుదలయ్యి మంచి విజయాన్ని సాదించాయి. ఇప్పడు ఈనెల 24 న మూడవ సాంగ్ విడుదల కి సన్నాహలు చేస్తున్నారు. ఈ సాంగ్ కి లిరిక్ ని మెంటల్ మదిలో, బ్రోచేవారేవురురా చిత్రాల ద్వారా దర్శకుడు గా మంచి సక్సస్ ని సాందించి ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా అంటే సుందరానికి చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్న వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందిస్తున్నారు.ఈ ఆడియో ని లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్ లో అందుబాటలో ఉంది.
నటీనటులు
నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్
సాంకేతిక వర్గం
పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే
ఎడిటర్ : బి. సుభాష్కర్
సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్
మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి
నిర్మాతలు : ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ
రచన – దర్శకత్వం : రాజ్ విరాట్