యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జ, సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన జంటగా నంద కిషోర్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పొగరు. కరాబు మైండ్ కరాబు.. అంటూ విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కన్నడలో ఈ సాంగ్ విడుదలైన దగ్గర నుండి మిలియన్స్ మిలియన్స్ వ్యూస్ తో రికార్డులు సాదించింది. ఆ తర్వాత పొగరు పేరుతో తెలుగులో కూడా తన పొగరు చూపించాడు స్టార్ హీరో దృవ సర్జా. ఈ సినిమా నుంచి విడుదలైన పాట తెలుగులో కూడా రికార్డులు సృష్టించింది. పొగరు పాట యూట్యూబ్లో 50 మిలియన్ వ్యూస్ దాటింది. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం చాలా మంది పోటీ పడగా 3 కోట్లకి పైగా ఫ్యాన్సి రేటుతో వైజాగ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సియర్, ప్రోడ్యూసర్ డి. ప్రతాప్ రాజుగారు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సీడెడ్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుంతకల్లు నాగరాజు 63 లక్షల ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా ఉన్న పొగరు ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. అనువాద సినిమా అయినా కూడా అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నాయని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఖచ్చితంగా తెలుగులో కూడా ఈ సినిమాతో ధ్రువ సర్జ సంచలన విజయం అందుకుంటాడు అని వారు నమ్మకంగా చెబుతున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత డి.ప్రతాప్ రాజుగారు మాట్లాడుతూ.. ఇటీవల ఒక్క సాంగ్ తో యూట్యూబ్ లో టివి ఛానల్స్ లో రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకుని ట్రెండింగ్ లో వున్న పొగరు కన్నడ చిత్రం తెలుగు హక్కులను మా సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో 3 కోట్ల 30 లక్షలకి సొంతం చేసుకున్నాము. ఈ సినిమా సాంగ్ కన్నడలో 170 మిలియన్స్ పైగా వ్యూస్ తెలుగులో 50 మిలియన్స్ వ్యూస్ కి పైగా రావటం అతి పెద్ద రికార్డని చెప్పాలి. ఇంత క్రేజ్‌వచ్చిన సినిమాకి మన టాలీవుడ్ నుండి చాలా పెద్ద కాంపిటేషన్ రాగా మా సంస్థ సొంతం చేసుకోవటం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా తెలుగు, కన్నడ బాషల్లో సైమంటెన్స్ గా విడుదల కి సన్నాహలు చేస్తున్నాము. వరుసగా మూడు సూపర్‌హిట్స్ తో డబుల్ హ్యట్రిక్ కి శ్రీకారం చుడుతూ కన్నడలో దూసుకుపోతున్న దృవ సర్జా, టాలీవుడ్ లో ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్‌హిట్ అంటూ స్టాంప్ వేసుకున్న నేచురల్ బ్యూటి రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. వీరిద్దరి మద్య వచ్చిన కరాబు సాంగ్ విజువల్ గా అందర్ని విపరీతం గా ఆకట్టుకుంటుంది. రిపీట్ గా చూస్తున్నారంటే ఈ చిత్రం పై క్రేజ్ ఏ రేంజ్ లో వుందో తెలుస్తుంది. ఈ సినిమా కి దర్శకుడు నంద కిషోర్ ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా తెరకెక్కించారు. మ్యూజిక్ దర్శకులు చందన్ శెట్టి, అర్జున్ జన్య లు ఇచ్చిన ప్రతి సాంగ్ సంచలనం కాబోతుంది. ఈ చిత్రంలో మరో క్రేజ్ గా WWEలో ఫేమస్ ఫైటర్స్ కాయ్ గ్రీనే, మోర్గన్ అస్తే ,జో లిండర్, జాన్ లోకస్ లు ఈ చిత్రం లో విలన్స్ గా నటిండం విశేషం. ఈ నలుగురి బాడి బిల్డర్స్ కి దృవ సర్జా కి మద్య యాక్షన్ సన్నివేశారు సబ్రమాశ్చర్యపరుస్తాయి. ఇలాంటి చాలా సర్‌ప్రైజ్ లు ఈ చిత్రం లో డైరక్టర్ క్రియెట్ చేశాడు. ఇంకా మరిన్ని విషయాల్ని మరోక్కసారి తెలియజేస్తాం..అని అన్నారు.
బ్యానర్.. సాయి సూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం.. చందన్ శెట్టి, అర్జున్ జన్య
నిర్మాత.. డి. ప్రతాప్ రాజు
దర్శకుడు.. నంద కిషోర్