రికార్డు సమయంలో 3.6 కిమీల ‘వెలిగొండ’ సొరంగం తవ్వకం.. రికార్డు సమయంలో వెలుగొండ టన్నెల్1

వెలిగొండ.. కరువు సీమ కడగండ్లు తీర్చే గొప్ప ప్రాజెక్టు.. దీని పూర్తి పేరు.. ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు ఇప్పుడు కరువుతో అల్లాడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు వడివడిగా పూర్తి అవుతోంది. నీటిని శ్రీశైలం జలాశయం ముందరి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా పంపిస్తారు. ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి నల్లమల కొండలశ్రేణి లో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టీఎంసీ నీటిని నిల్వచేయగలదు.

టీడీపీ హయాంలో వెలగొండ ప్రాజెక్టు నత్తనడకనగా సాగింది. రోజుకు ఒక అడుగు చొప్పున మాత్రమే తవ్వారు. ఇప్పుడు రోజుకు 30 అడుగులు( 9.23 మీటర్ల చొప్పున ) తవ్వడం ద్వారా మొదటి సొరంగం పూర్తి చేయడం విశేషం. సీఎం జగన్‌ హామీ మేరకు వచ్చే సీజన్‌ నాటికి ప్రాజెక్ట్‌ తొలి దశను పూర్తి చేసే దిశగా పనులు వేగవంతం సాగుతున్నాయి.

వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులను మేఘా ఇంజనీరింగ్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ తో ప్రకాశం, కడప జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. ఇక వెలిగొండ సొరంగ మార్గం కోసం ఎంఈఐఎల్ సంస్థ అతిపెద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ను వినియోగించింది. కరోనా, ఇతర అవరోధాలను ఎదుర్కొని రికార్డు సమయంలో 3.6 కిలోమీటర్ల తవ్వకం పూర్తి చేసింది. ఎంఈఐల్ సంస్థ రాత్రింబవళ్లు కష్టపడి 9.23 మీటర్లు తవ్వడం ద్వారా ఈ పనులు పూర్తి చేసింది. రెండో సొరంగం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పూల సుబ్బయ్య వెలిగొండ మొదటి సొరంగం పూర్తి పొడవు 18 కిలోమీటర్లు.

ఒక్కో టన్నెల్ పొడవు 18 కిలోమీటర్లు ఉండగా శ్రీశైలం అభయారణ్య రక్షణ కోసం టిబిఎం – టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా సొరంగాల తవ్వకం చేపట్టారు. అత్యంత అరుదుగా టిబిఎంను వినియోగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా వెలిగొండ ప్రాజెక్ట్ లోనే వినియోగించారు. ఇక ప్రాజెక్ట్ కోసం ఆసియాలో పొడవైన కన్వేయర్ బెల్ట్ వినియోగిస్తోంది, 18 కిలోమీటర్లు టన్నెల్ లోకి కన్వేయర్ బెల్ట్ వెళ్లేందుకు రెండుగంటలు పడుతుంది. టన్నెల్ లో 50 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిలోనూ పనులు చేస్తున్న మేఘా సిబ్బంది. కరోనా, వర్షాలును సైతం తట్టుకొని మేఘా దాదాపు 10 మీటర్ల చొప్పున తవ్వారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ రెండో సొరంగ మార్గం పనులు సైతం ఊపందుకున్నాయి.

ఈ సొరంగం మార్గం ద్వారా 3001 క్యూసెక్స్ (85 క్యూసెక్స్) నీటిని తరలించనున్నారు. దేశంలోని పెద్ద గురుత్వాకర్షణ సొరంగాలలో ఇది ఒకటి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1.20 లక్షల ఎకరాల ఆయకట్ కు నీటి సరఫరాతో పాటు 4 లక్షల మంది ప్రజల అవసరాలు తీరనున్నాయి.

వెలిగొండ ప్రాజెక్ట్‌ మొదటి సొరంగాన్ని టీడీపీ హయాంలో 2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 వరకు కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వారు. రోజుకు సగటున 0.32 మీటర్ల మేర.. అంటే ఒక అడుగు మాత్రమే సొరంగాన్ని తవ్వారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక.. 2019 నవంబర్‌ నుంచి జనవరి 13, 2021 వరకూ మొదటి సొరంగంలో 3.6 కి.మీ. తవ్వి పనులను పూర్తి చేశారు. మార్చి 2020 నుంచి జూలై 2020 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగింది. జూన్‌ నుంచి నవంబర్‌ వరకూ నల్లమల అడవుల్లో భారీ వర్షాలు కురవడంతో సొరంగం తవ్వకానికి ఆటంకం కలిగింది. ఇన్ని అడ్డంకుల్లోనూ రోజుకు సగటున 9.23 మీటర్ల చొప్పున తవ్వుతూ సొరంగాన్ని పూర్తి చేశారు.

* వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్1 పూర్తి..
వెలిగొండ ప్రాజెక్ట్లోని టన్నెల్ -1 ను పనులు విజయవంతంగా పూర్తిచేశారు. 7.86 బాహ్యవలయ తవ్వకాలతో ఈ పనులను పూర్తిచేసినట్టు మెయిల్ సంస్థ అధికారులు తెలిపారు. అయితే టన్నెల్-1 ను పూర్తిచేసేందుకు హెరెన్నెక్ట్ అనే కంపెనీకి చెందిన టీబీఎం మెషిన్ను ఉపయోగించారు. ఈ సొరంగం ద్వారా 3001 క్యూసెక్కులను తరలించనున్నారు. ఈ టన్నెల్ ద్వారా దాదాపు 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. అంతేకాక 4 లక్షలమందికి తాగునీటి అవసరాలను తీర్చనున్నది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద గ్రావిటీ కెనాల్ అని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్లో టన్నెల్ పాత్ర ఎంతో కీలకమని అధికారులు తెలిపారు. టీబీఎం యంత్రంతో పాటు, టన్నెల్ -1 పోర్టల్, టన్నెల్ -1 ఎక్స్‌కవేటెడ్ మక్ డిశ్చార్జ్ కూడా ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషిస్తాయని అధికారులు చెప్పారు.

ప్రాజెక్ట్‌ను 2016 నాటికే పూర్తి చేస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్ల మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను దోచిపెట్టిన టీడీపీ సర్కారు కమీషన్లు వసూలు చేసుకుంటే.. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.61.76 కోట్లను ఆదా చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రికార్డు సమయంలో మొదటి సొరంగాన్ని పూర్తి చేయడం గమనార్హం.

* వైసీపీ హయాంలో ‘వెలిగొండ’ వాయువేగం..
ఇదే ప్రాజెక్ట్‌లో భాగమైన రెండో సొరంగం పనులను సైతం వేగవంతం చేశారు. నల్లమల సాగర్‌ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. నల్లమల సాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాలకు చెందిన 7,555 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు రూ.1,411.56 కోట్లను జూన్‌ 24న మంజూరు చేశారు. పునరావాస కాలనీల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చేలోగా నల్లమల సాగర్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు పనులు వేగం పుంజుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *