నటీనటులు : సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ తూములూరి, లీలా వెంకటేష్ తదితరులు
కథ-స్క్రీన్ ప్లే మాటలు-దర్శకత్వం : జయకిషోర్.బి
సినిమాటోగ్రఫీ : మోహన్ చారి.CH
స్క్రిప్ట్ కో ఆర్డినేటర్ : అమర్ నాథ్ చావలి
ఎడిటర్: వర ప్రసాద్.ఎ
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : మల్లి చెరుకూరి
ఆర్.కె.సినీ టాకీస్,ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వం లో రాజేష్ కొండెపు ,సృజన్ యారబోలు సంయుక్తంగా కలసి నిర్మించిన చిత్రం “మధుర వైన్స్”. ఈ చిత్రం అక్టోబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.
కథ
కాలేజీ డేస్ లో ఎంతో ఘాడంగా ప్రేమించిన మధుర తనకి దూరమవ్వడంతో తాగుడుకి బానిసగా మరతాడు అజయ్(సన్నీ నవీన్). ఈ క్రమంలో అజయ్ కిసీమా చౌదరి (అంజలి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అజయ్ గతం తెలుసుకునే క్రమంలో అతనితో ప్రేమలో పడుతుంది అంజలి. పరిచయమైన కొన్ని రోజులకే మధుర ని మర్చిపోయి అంజలితో ప్రేమలో పడతాడు అజయ్. రియల్ ఇస్టేట్ వ్యాపారంలో నష్టపోయిన ఆనందరావు (సమ్మోహిత్ తూములూరి) ఫైనల్ గా మధుర వైన్స్ పెట్టి మధ్యం అమ్ముతుంటాడు. రోజు తన వైన్స్ లో మందు తాగుతూ కెరీర్ నాశనం చేసుకుంటున్న అజయ్ ని చూస్తూ తట్టుకోలేకపోతాడు ఆనంద రావు. ఇంతకీ అంజలి ఆనంద్ రావు కి ఏమైవుతుంది ?అజయ్ తాగుడుగు ఎందుకు బానిస అయ్యాడు? ఫైనల్ గా అజయ్ , అంజలి ల ప్రేమకు ఆనందరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ? లేదా అనేది మిగతా కథ.
నటీనటుల పనితీరు
షార్ట్ ఫిల్మ్ లో నటించిన సన్నీ నవీన్ హీరోగా వెండితెరపై మొదటి సారిగా నటించినా చాలా చలాకీగా కనిపించాడు. మంచి ఎనర్జీతో నటన,డాన్స్, యాక్షన్ అన్ని అంశాలు చక్కగా చేసాడు.ఇక హీరోయిన్ సీమా చౌదరి అంజలి గా తను ఎంతో అందంగా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుందనే చెప్పాలి.అలాగే హీరో , హీరోయిన్స్ ల రొమాన్స్ కిస్ సీన్స్ బాగా పండింది. మరియు ఆనందరావు మధుర వైన్స్ ను మెయింటైన్ చేస్తూ చెల్లెలను ప్రేమగా చూసుకుంటూ మధుర వైన్స్ లో ఏ కల్తీ లేకుండా నిజాయితీగా అమ్మే పాత్రలో నటించిన సమ్మోహిత్ తూములూరి తనకిచ్చిన పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు.హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన లీల, మిగతా నటీనటులు వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు జయకిషోర్.బి మధుర వైన్స్ చుట్టుపక్కల జరిగే పాత్రలతో ఓ సరికొత్త ప్రేమ కథను ఎంపిక చేసుకుని తాను అనుకున్న కథ, కథనాలను చాలా చక్కగా తెరకెక్కించాడు.ఇలాంటి కథకు స్క్రిన్ ప్లే అండ్ కనెక్టెడ్ లాజిక్కులు చాలా అవసరం.వాటిని ఎక్కడా మిస్ అవ్వకుండా బాగా డైరెక్ట్ చేసి ముందు ముందు మంచి సినిమాలు ఇండస్ట్రీ కి అందించగల దర్శకుడిగా తన స్టామినా ఏంటో చూపించారు. అలాగే ఇందులో డైలాగ్స్ అక్కడక్కడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్న సినిమా అంటే వల్గర్ మాటలు, డబుల్ మీనింగ్ మాటలు ప్రస్తుతం వస్తున్న సినిమాలలో వుంటాయనే ముద్రపడ్డ ప్రస్తుత టైం లో అవేవి లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “మధుర వైన్స్” సినిమా మాత్రం యూత్ కు బాగా నచ్చేస్తుంది. తండ్రీ,కొడుకుల ఎమోషన్, అన్న, చెల్లెలు ఎమోషన్ ను దర్శకుడు బాగా క్యారీ చేశాడు. యూత్ కు, ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో చాలా పుష్కలంగా ఉన్నాయి. దానితో పాటు హీరో తాగుడుకు బానిస అయినా.. నీ ప్రేమలో నిజాయతి ఉంటే మరొకరి ద్వారా నీకు కావలసిన ప్రేమను దగ్గర చేస్తుందనే అంశాన్ని క్లుప్తంగా చెప్పారు. ఈ సినిమాకు కార్తిక్ rodriguez, జయ్ క్రిష్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి .ఇందులో వచ్చే రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ చాలా బాగుంది. ఈ సినిమాకు మోహన్ చారి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రెమ్ ని అందంగా చూపించారు. వర ప్రసాద్. ఎడిటింగ్ పనితీరు అద్భుతంగా ఉంది. ఈ చిత్ర నిర్మాతలు రాజేష్ కొండెపు, సృజన్ యారబోలు ఖర్చుకు వెనకాడకుండా తీసిన నిర్మాణ విలువలు చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు బాగా నచ్చే ప్రేక్షకులు వెళ్లి హ్యాపీ గా సినిమా చూసి ఒక మంచి కంటెంట్ అండ్ హానెస్ట్ సినిమా చూసాము అన్న ఫీలింగ్ తో బయటకు వస్తారు. అలాగే ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరికీ తప్పక నచ్చుతుంది.
మూవీ రేటింగ్ ..3/5