అమెజాన్ ఒరిజినల్ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్ ఆవిష్కరణ

ప్రముఖనటులు విజయ్ దేవరకొండ, రశ్మికా మందణ్ణ నేడిక్కడ అమెజాన్ ఒరిజినల్ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ చిత్రానికి వినోద్ అనం తో జు దర్శకత్వం వహించారు. ఈ రాబోయే తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామాలో ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్ల మ్మ నటించారు. భవ్య క్రియేషన్స్ చే నిర్మించబడింది.

మిడిల్ క్లాస్ మెలోడీస్ అనేది వినోదంలో ఓ తాజా శ్వాస. సకుటుంబ వినోదానికి హామీ ఇస్తుంది. నవ్వుల తో, నాటకీయతతో అల్లుకున్న మధుర ప్రేమకథా చిత్రం. సరదాగా సాగే హాస్యంతో కొంతమంది మధ్య తరగతి మనుషుల కలలు, నమ్మకాలు, పోరాటాలు, ఆశల చుట్టూరా ఈ చిత్రం తిరుగుతుంది. భారత దేశంలో మరియు 200 దేశాలు, టెరిటరీస్ లలో ప్రైమ్ సభ్యులు మిడిల్ క్లాస్ మెలోడీస్ యొక్క వరల్డ్ ప్రీమి యర్ నవం బర్ 20న ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోపై మాత్రమే దీన్ని చూడవచ్చు.

ఈ సందర్భంగా దర్శకుడు వినోద్ అనంతోజు మాట్లాడుతూ, ‘‘మిడిల్ క్లాస్ మెలోడీస్ అనేది ప్రతీ ఒక్కరి కథ – నేను, మనలో ప్రతీ ఒక్కరిది. చూసేందుకు పెద్దగా కనిపించే చిన్న చిన్న కలలతో తరమబడే వా రందరిది. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పాత్రల చుట్టూరా తిరిగే కథ ఇది. వారి జీవన ప్రయాణాలు ఎలా సాగుతాయో వివరించేది. మనకు సంబంధించిన కథాంశంతో సున్నిత హాస్యాన్ని మేళవించిన ఈ సి నిమాలో నిజజీవిత ఘటనల హాస్యాన్ని ప్రేక్షకులు ఆనందిస్తారని నేను విశ్వసిస్తున్నా. మిడిల్ క్లాస్ మెలో డీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం నాకెంతో ఆనందదాయకం. ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల పెదవులపై నేను నవ్వులు విరబూయించగలుగుతాను’’ అని అన్నారు.

నటుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, ‘‘మిడిల్ క్లాస్ మెలోడీస్ నేను చాలా మంది అది తమ పాత్ర గా భావించే సగటు మనిషి పాత్ర పోషించాను. అతడికి పెద్ద పెద్ద కలలు ఉంటాయి. అయితే వాటిని నెర వేర్చుకోవడం మాత్రం అంత సులభం కాదు. జీవితంలోనూ చాలా సందర్భాల్లో అదే జరుగుతుంది. రాఘవ పాత్ర నేను గతంలో పోషించిన పాత్రల కంటే విభిన్నమైంది. నిజంగా ఇది సవాళ్లతో కూడుకున్న పాత్ర. ఏక కాలంలో నవ్వులను, ప్రేమను పండించాల్సి ఉంటుంది. అయితే వర్ష, వినోద్ వంటి ప్రతిభావంతులతో కలసి పని చేయడంతో ఇది నాకెంతో సులభమైపోయింది. ఎంతో సౌకర్యంగానే పూర్తయిపోయింది’’ అని అన్నారు.
ప్రధాన పాత్రలో నటించిన వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ, ‘‘మిడిల్ క్లాస్ మెలోడీస్ అనేది నా మనస్సుకు ఎంతగానో నచ్చిన సినిమా. ఎందుకంటే ఈ జట్టులో మేమంతా కూడా దీని కోసం ఎంతో ప్రేమతో, ఇష్టంతో కలసి పని చేశాం. దీన్ని గనుక చూస్తే, అది ఇక మనస్సుకు హత్తుకుపోవడం ఖాయం. పరిస్థితులు, క్యారెక్టర్లు…ప్రతీ ఒక్కటి కూడా నిజమైందిగా ఉంటుంది, మనకు సంబంధించిందిగా ఉంటుంది. గుంటూరు మాండలికం కోసం నేను బాగా కష్టపడాల్సి వచ్చింది. ఎంతో శిక్షణ పొందాల్సి వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన దర్శకుడు వినోద్ తో కలస పని చేయడం గొప్పగా అనిపించింది. డైలాగులు సరిగా పలకడంలో ఆయన నాకెంతో సాయం చేశారు’’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *