శ్రీమతి అరుణ సమర్పణలో అరుణోదయ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీను చెంబేటి నిర్మిస్తున్న సినిమా ” చిల్ బ్రో “. రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కుంచం శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య శ్రీనివాస్, పవన్ తేజ, రూపిక జంటగా నటిస్తున్నారు, వారితో పాటు ఇంధు, నాగి, కుంతి శ్రీనివాస్, ప్రదీప్ రాపర్తి, యాదమ్ రాజు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పెట్టిన చిల్ బ్రో అనే క్యాచీ టైటిల్ అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో చిల్ బ్రో చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకులు వి.ఐ ఆనంద్, రమణతేజ విడుదల చేశారు. 19 నవంబర్, 2020 ఉదయం 9 గంఃలకు దర్శకులు వి.ఐ.ఆనంద్, రమణతేజ తమ ట్విట్టర్ ఖాతాలు ద్వారా ఆన్ లైన్ లో చిల్ బ్రో ఫస్ట్ లుక్ ని విడుదల చేసి చిత్ర బృందానికి శుభాభినందనుల తెలిపారు. సూర్య శ్రీనివాస్, రూపిక, పవన్ తేజ కాంబినేషన్ లో వినూత్నంగా చిల్ బ్రో ఫస్ట్ లుక్ ని డిజైన్ చేయడం జరిగింది. యూత్ కి కావాల్సిన అన్ని కమర్షీయల్ ఎలిమెంట్స్ తో రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లుగా దర్శకుడు కుంచం శంకర్ తెలిపారు. త్వరలోనే చిల్ బ్రో కి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాత చెంబేటి శ్రీను చెప్పారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకులు సురేశ్ బొబ్బిలి అందిస్తున్నారు.
తారాగణం
సూర్య శ్రీనివాస్, పవన్ తేజ, రూపిక, ఇంధు, నాగి, కుంతి శ్రీనివాస్, ప్రదీప్ రాపర్తి, యాదమ్ రాజు
సాంకేతిక వర్గం
సమర్పణ – శ్రీమతి అరుణ
బ్యానర్ – అరుణోదయ ప్రొడక్షన్
నిర్మాత – శ్రీను చెంబేటి
మ్యూజిక్ – సురేశ్ బొబ్బిలి
డిఓపి – ఎస్. భాస్కర్
ఎడిటర్ – బి. నాగేశ్వర రెడ్డి
సహనిర్మాతలు – టి.శైలజ, కొండాల్
రైటర్స్ – రాజేశ్ భట్టు, సి.రోహిత్
స్టంట్స్ – వింగ్ చన్ అంజి
దర్శకుడు – కుంచం శంకర్