ఈ ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా మార్చ్ 27న ట్విట్టర్‌లో అడుగు పెట్టాడు మెగా పవర్ స్టార్. సినిమాల్లో ఇప్పటికే ఎన్నో సంచలన రికార్డులు సాధించిన చరణ్.. ట్విట్టర్‌లో కొత్త రికార్డుకు తెర తీసాడు. ట్విట్టర్ ఖాతాలో 10 లక్షల మంది ఫాలోయర్స్ వచ్చారు. చాలా తక్కువ సమయంలోనే 1 మిలియన్ పాలోయర్స్ సాధించిన కొత్త రికార్డు రామ్ చరణ్ తన పేర రాసుకున్నాడు. టాలీవుడ్‌లో ఈయన కంటే వేగంగా 1 మిలియన్ ఫాలోయర్స్ ఎవరికీ రాలేదు. ట్విట్టర్‌లోకి అడుగు పెట్టిన కేవలం 233 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించి మెగా పవర్ చూపించాడు రామ్ చరణ్.