వారణాసి (కాశీ) లో తెలుగువారి కోసం అధునాత‌న కరివెన సత్రం

తెలుగు యాత్రికుల కోసం కాశీలో మరో అధునాతన భవనం అందుబాటులోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 4:05 గంటలకు కాశీ – పాండే హవేలీలో అఖిల బ్రాహ్మణ కరివెన సత్రం నిర్మించిన నూతన భవనానికి గృహ ప్రవేశం జరిగింది. కార్తీక మాసంలో ఏకాదశి రోజున కాశీ క్షేత్రంలో ఈ కరివెన సత్రం లాంఛనంగా ప్రారంభమైంది. 34 నూతన గదులు, అధునాతన సౌకర్యాలతో కాశీకి వచ్చే యాత్రికుల కోసం ఈ కరివెన సత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే కాశీలో యాత్రికుల కోసం 4 చోట్ల కరివెన సత్రం ఆధ్వర్యంలో నిత్యాన్నదాన, వసతి సౌకర్యం సేవలను అందజేస్తున్నారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో 5వ భవనాన్ని అఖిల బ్రాహ్మణ కరివెన సత్రం నిర్వాహకులు ప్రారంభించారు.

వారణాసి (కాశీ) లోని పాండే హవేలిలో అఖిల భార‌త బ్రాహ్మణ కరివెన సత్రం నిర్మించి, ఈ కార్తీకమాసంలో ఏకాదశి రోజున కాశీ క్షేత్రంలో ఈ సత్రం ప్రారంభించారు. 34 కొత్త గదులు, అధునాతన సౌకర్యాలతో కాశీకి వచ్చే యాత్రికుల కోసం ఈ కరివెన సత్రం నిర్మాణం చేశారు. ఇప్పటికే కాశీలో యాత్రికుల కోసం నాలుగు చోట్ల కరివెన సత్రం ఆద్వర్యంలో నిత్యాన్న దాన, వసతి సౌకర్యం సేవలు అందిస్తున్నారు.

ఇన్ని స‌త్రాలున్నా, కాశీకి భ‌క్తుల రద్దీ పెరుగుతుండటంతో అయిదో భవనాన్ని అఖిల భార‌త బ్రాహ్మణ కరివెన సత్రం నిర్వాహకులు ప్రారంభించారు. ఇది యాత్రికుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని అఖిల భార‌త బ్రాహ్మణ కరివెన సత్రం నిర్వాహ‌కులు తెలిపారు. ఎక్క‌డి నుంచి అయినా ఇందులో గ‌దుల‌ను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవ‌చ్చ‌ని, అయితే నియ‌మ నిబంధ‌న‌లు మాత్రం క‌చ్చితంగా పాటించాల‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *