తారాగణం : పృద్వి దండమూడి, మైరా దోషి, ఆనంద్, వినయ్ వర్మ, బెనార్జీ, సత్య అక్కల
దర్శకత్వం : శ్రీవర్ధన్
నిర్మాత : ప్రసాద్ నెకురి
సంగీత దర్శకుడు: నరేష్ కుమారన్
పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ రిలీజ్ తో ముందుకొచ్చిన తాజా చిత్రం “ఐఐటి కృష్ణమూర్తి”.మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.
కథ:
ముంబై ఐఐటీ స్టూడెంట్ కృష్ణమూర్తి (ఫృద్వీ) మిస్సైన తన బాబాయ్ ని వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తాడు. అన్వేషణ మొదలెడతాడు. తన ఐఐటీ తెలివితేటలను ఉపయోగిస్తాడు. పోలీస్ లను సైతం ఆశ్రయిస్తాడు.అయితే ఈ జర్నీలో కృష్ణమూర్తి మీద కొంతమంది గుర్తు తెలయని వ్యక్తుల దాడి జరగుతుంది. అలాగే పోలీస్ లు సైతం ఓ గుర్తు తెలియని శవాన్ని అంటగట్టి కేసు క్లోజ్ చెయ్యాలని చూస్తున్నారని అర్దమవుతుంది. అసలేం జరుగుతోంది.తన చుట్టు ఉన్న అనేకానేక అనుమాన్సద డాట్స్ ని కలిపి ఆ మిస్టరీని ఎలా ఛేధించాడు..అతని బాబాయ్ ని ఎవరు చంపారు…ఆ హత్యకు పోలీస్ లకు సంభందం ఏమిటి…చివరకు ఏమైంది..అనేది మిగతా కథ.
విశ్లేషణ :
ఒక క్రైమ్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రంలో దానిని ఓ మోస్తరుగా బాగానే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ లో అది బాగా అనిపిస్తుంది. అలాగే మరికొన్ని సన్నివేశాల్లో కూడా అది బాగా ఎలివేట్ అవుతుంది. ఇక అలాగే ఓ కీలక పాత్రలో కనిపించిన వినయ్ వర్మ మంచి అవుట్ ఫుట్ ని ఇచ్చాడు.
కమెడియన్ సత్య కూడా తన రోల్ పరిమితి మేర మంచి టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ మైరా దోషి తనకు తక్కువ స్పేస్ ఉన్నా తన పాత్ర పరిధి మేరకు బాగానే చేసింది. ఇంకా మరో సీనియర్ నటుడు బెనర్జీ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కూడా మంచి రోల్ తో ఇంప్రెస్ చేసారని చెప్పొచ్చు.
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అని చెప్పొచ్చు కొన్ని సీన్స్ లో కనిపించే సెట్ వర్క్ బాగుంది. అలాగే సినిమాటోగ్రాఫ్ డీసెంట్ గా అనిపిస్తుంది.నిర్మాణ పరంగా పూర్తి మార్కులు పడతాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
ఇక దర్శకుని విషయానికి వస్తే..శ్రీవర్ధన్ ఎంచుకున్న ఆలోచన బాగుంది .దాన్ని ఆన్ స్క్రీన్ పై తెరకెక్కించడంలో చాలా మేర సఫలం అయ్యారనే చెప్పాలి.అలాగే స్క్రీన్ ప్లే మరియు లాజిక్కులు మీద శ్రద్ద మంచి శ్రద్ద కనపరిచాడు.
ఈ సినిమాలో కొత్తగా పరిచయమైన కుర్రాడు చూడటానికి బాగున్నాడు. ఈ పాత్రలో బాగా ఒదిగిపోవటానికి ప్రయత్నించాడు.తన యాటిట్యూడ్, లోలోపల పడుతున్న స్ట్రగుల్… ఇవన్నీ చక్కగా పలికాయి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మంచి భవిష్యత్ ఉంటుంది.
రేటింగ్ : 3.0