సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం ప్రకటించిన మేఘా కంపెనీ

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ముందుకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపు మేరకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(MEIL) భారీ విరాళం ప్రకటించింది. వర్షాల వల్ల నష్టపోయిన తెలంగాణ ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన మేఘా సంస్థ రూ. 10 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నారు. ఈ మేరకు మేఘా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

వరద బాధితులకు అండగా నిలిచి, ప్రభుత్వ సహాయక చర్యలకు మద్దతుగా ఉండేందుకు ఈ సహాయం ప్రకటించినట్లు మేఘా యాజమాన్యం తెలిపింది. ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగరం భారీ వరదలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. బాధ్యత గల కార్పొరేటు సంస్థగా, రాష్ట్ర ప్రభుత్వానికి, హైదరాబాద్ ప్రజలకు సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్టుగా తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *