అల్లు శిరీష్ హీరోగా నటించిన విభిన్నమైన చిత్రం ఒక్క క్షణం. ఈ సినిమా విడుదలై నేటికి నాలుగు సంవత్సరాలు గడిచింది. నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ ప్రేక్షకుల మన్ననలను అందుకొని ఒక్క క్షణం నిజమైన పాన్ ఇండియా సినిమాగా నిలిచింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు అల్లు శిరీష్. ‘ఒక్క క్షణం సినిమా అప్పుడే నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది ఎప్పుడు నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. మొత్తం నేను చేసిన సినిమాల్లో ఇది బెస్ట్ ఫిలిం. హిందీలో ‘షూర్ వీర్ 2’ పేరుతో అనువాదమై అక్కడ యూట్యూబ్, టీవీలో అతి పెద్ద విజయం సాధించింది. గతేడాది లాక్ డౌన్ సమయంలో ‘అంద ఓరు నిమిదం’ పేరుతో తమిళంలో విడుదలైంది. స్టార్ విజయ్ లో ఎక్కువ సార్లు ఈ సినిమాను ప్రసారం చేశారు. అలాగే హాట్ స్టార్ లో కూడా తమిళ వర్షన్ మంచి విజయం సాధించింది. మలయాళంలో విడుదలై అక్కడ కూడా ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకని ఒక్క క్షణం. 4 విభిన్నమైన భాషల్లో మంచి అప్లాజ్ అందుకున్న ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను ప్రేక్షకులకు అందించినందుకు నాకు, దర్శకుడు వి4.ఐ.ఆనంద్ కు గర్వంగా ఉంది. అందుకే దీన్ని నిజమైన పాన్ ఇండియా సినిమా అంటున్నాను. ఈ సినిమా సంవత్సరాల సెలబ్రేషన్ కు ఇంతకంటే సంతోషకరమైన కారణాలు అవసరం లేదు. సినిమా పట్ల మీరు చూపించిన ప్రేమకు ఎప్పుడు రుణపడి ఉంటాను..’ అని తెలిపారు.