పవన్ కడప పర్యటన వెనుక అసలు కథ ఇథేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాయలసీమలో పర్యటించడం వెనుక పక్కా ప్లాను ఉందా..? జగన్ త్వరలో చేయబోయే ఓ పనికి తానే కారణం అని చెప్పుకోవడానికి వీలుగా ఇప్పుడీ పర్యటన తలపెట్టారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాను డిమాండ్ చేస్తే వైసీపీ ప్రభుత్వం కదిలొచ్చి పనులు చేస్తుందన్న బిల్డప్ ఇవ్వడానికి ఉపయోగపడేలా ఈ టూర్ ప్లాన్ చేశారని టాక్.

రాయలసీమ పర్యటన అంటూ సీమలో అడుగుపెట్టిన పవన్ అక్కడి నుంచే సీఎం జగన్పై విమర్శలు చేశారు. వ్యూహాత్మకంగా కడప ఉక్కు కర్మాగారం అంశాన్ని ప్రస్తావించారు.  “ఉక్కు కర్మాగారం పై ఎందుకు జగన్ మాట్లాడటం లేదు జగన్ కి కడప ఉక్కు నిర్మాణంపై చిత్తశుద్ది లేదా?” అంటూ ప్రశ్నలు వేశారు. జగన్ ఈ ప్రశ్న వేయడానికే రాయలసీమలోకి వచ్చారని తెలుస్తోంది. విజయవాడలోనే ఇంకెక్కడో ఉండి ఈ ప్రశ్న వేస్తే రాయలసీమ ప్రజలకు ఎంతవరకు రీచవుతుందో చెప్పలేం.. కానీ సీమ నుంచే ఈ ప్రశ్న వేస్తే వారికది స్పష్టంగా వినిపిస్తుంది.

అయితే వారికి తెలిసేలా కడప ఉక్కుపై పవన్ ఎందుకు ప్రశ్నించాలనుకున్నారన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. జగన్ డిసెంబర్ 26న కడప ఉక్కు కర్మాగార శంఖుస్థాపన చేయబోతున్నారు. అంటే గట్టిగా మరో 20 రోజుల్లో ఈ శంకుస్తాపన ఉంది. ఆ రోజున పవన్ తాను రాయలసీమ పర్యటనలో గట్టిగా ప్రశ్నించడం వల్లే జగన్ శంకు స్థాపన చేశారని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది.

కానీ ఇక్కడ పవన్ మిస్సయిన లాజిక్ ఒకటుంది. వై.యస్.ఆర్ జయంతి సందర్భంగా జులై 8న ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ సభలోనే దీనిపై ప్రకటన చేశారు. డిసెంబర్ 26న శంఖుస్థాపన చెసి 3 ఏళ్ళలో పూర్తి చేసి ప్రత్యక్షంగా 20వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగం పరోక్షంగా 50వేల మందికి ఉపాది కల్పిస్తామని చెప్పారు. పాపం పవన్ ఇదంతా ఫాలో కాలేదేమో ఏమో కానీ ఇప్పుడు క్రెడిట్ హైజాక్ చేయడానికి రాయలసీమకు వచ్చారని రాజకీయవర్గాల నుంచి వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *